జడ్జి జగ్దీప్ సింగ్ కు భద్రత పెంపు

బాబా గుర్మీత్ సింగ్  రే ప్ కేసులో దోషిగా తేలటంతో భారీ విధ్వంసం జరిగింది. ఐతే ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన జడ్జి జగ్దీప్  సింగ్  కు భద్రత పెంచాలని కేంద్రం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. గుర్మీత్   సింగ్  మద్దతుదారులు జడ్జిపై దాడి చేసే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అటు గుర్మీత్   సింగ్  ను దోషిగా తేల్చిన జస్టిస్ జగ్దీప్  సింగ్ కు న్యాయశాస్త్రంలో దిట్టగా పేరుంది. 2000 సంవత్సరంలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్య పూర్తిచేశారు. చదువుకునే రోజుల్లోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చేవారు. రెండేళ్లు హర్యానా హైకోర్టు  లో ప్రాక్టీస్ చేసిన ఆయన 2012లో హరియాణా జ్యుడిషియల్   సర్వీసుకు ఎంపికయ్యారు. గతేడాదే సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. అత్యంత సాధారణ జీవితాన్ని ఇష్టపడే జగ్దీప్   సింగ్ ది ఉదారస్వభావం. ఏ కేసులోనైనా అన్ని అంశాలను అధ్యయనం చేసిన తర్వాతే తీర్పు ఇస్తారని ఆయనకు పేరుంది. తాజాగా గుర్మీత్ సింగ్   కేసులోనూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఆయన తీర్పు ఇచ్చి…తన ప్రత్యేకతను చాటుకున్నారు.