జగిత్యాల జిల్లాలో భారీ వర్షం

జగిత్యాల జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మెట్ పల్లి, మల్లాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలాలు పెరగడంతో పాటు.. మొక్కజొన్న, పసుపు, వరి పంటలకు ఊరటనిచ్చాయి. ఇబ్రహీం పట్నం మండలం యామపూర్‌, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య హై లెవల్ వంతెనపై నుంచి వర్షంనీరు పోతుండడంతో… ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.