గొర్రెలు పంపిణీ చేసిన డిప్యూటీ స్పీకర్

అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఆమె పర్యటించారు. నందగోకుల్, నస్కల్, బచ్చురాజుపల్లి, తిప్పనగుళ్ల, కల్వకుంట గ్రామాల్లో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. రైతులకు సర్కారు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.