గణపతి ఉత్సవాలు ప్రారంభించిన మంత్రి

వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలోని పలు కాలనీల్లో జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో మంత్రి మహేందర్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మహేందర్‌ రెడ్డి, నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.