ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ దంపతుల పూజలు

రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో కొలువు దీరాడు. గణేశుడికి గవర్నర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పోరేటర్ విజయారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.