క్షణ క్షణం ఉత్కంఠ!

మనీష్‌బాబు, తేజస్విని జంటగా నటిస్తున్న చిత్రం ప్రతిక్షణం. జి. మల్లిఖార్జునరెడ్డి నిర్మిస్తున్నారు. నాగేంద్రప్రసాద్ దర్శకుడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. “హారర్, లవ్, కామెడీ అంశాలతో ప్రతిక్షణం థ్రిల్‌ను కలిగించే చిత్రమిది. అడవిలోని ఓ భవంతిలో అడుగుపెట్టిన నిత్య అనే అమ్మాయికి అక్కడ ఎలాంటి భయానక సంఘటనలు ఎదురయ్యాయన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఈ నెల 18న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ అమృతరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు.