క్యాండీ టెస్టులో ధావ‌న్ సెంచ‌రీ

క్యాండీలో శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో శిఖ‌ర్ ధావ‌న్ దుమ్మురేపుతున్నాడు. కేవ‌లం 106 బంతుల్లో 15 బౌండ‌రీల‌తో  టెస్ట్ కెరీర్ లో ఆర‌వ సెంచ‌రీ న‌మోదు చేశాడు.  ధావ‌న్‌, రాహుల్  క‌లిసి తొలి వికెట్‌కు 188 ర‌న్స్ జోడించారు. 85 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ దగ్గర రాహుల్ ఔట‌య్యాడు. ఇండియా 43 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 201 ర‌న్స్ చేసింది. ధావ‌న్ 109, పుజరా 2 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో ధావ‌న్‌కు ఇది రెండ‌వ సెంచ‌రీ కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు అత‌ను శ్రీలంక‌పై మూడు సెంచ‌రీలు చేశాడు.