కోలాహలంగా వినాయక నిమజ్జనం

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. మూడు రోజుల పాటు పూజలందుకున్న ఉమాసుతునికి ప్రజలు.. భక్తి శ్రద్ధలతో వీడ్కోలు పలుకుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి లంబోదరుణ్ని ఊరేగింపుగా తీసుకొచ్చి.. హుస్సేన్  సాగర్ లో నిమజ్జనం చేస్తున్నారు. దీంతో, ఆ ప్రాంతమంతా గణపతి బొప్పా మోరియా నినాదాలతో హోరెత్తిపోతోంది. నిమజ్జనం సందర్భంగా  పోలీస్‌, విద్యుత్‌, ఇరిగేషన్‌ అధికారులు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు, కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.