కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

హిమచల్‌ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. మండి- పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న మూడు వాహనాలపై కొట్రూపి గ్రామ సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగి పడటంతో ఓ బస్సు సుమారు 800 మీటర్ల దూరం పల్టీ కొట్టింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఐతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. మరిన్ని కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో పోలీసులు జాతీయ రహదారిని మూసివేశారు.

అటు ఈ దుర్ఘ‌ట‌న పై స్పందించిన ప్ర‌ధాని మోడీ స్పందించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో గ‌త కొన్ని రోజులుగా కొండ చ‌రియ‌లు విరిగి ప‌డి ఎంతో మంది త‌మ ప్రాణాల‌ను కోల్పోతున్నార‌ని.. ఇది చాలా బాధాక‌ర‌మైన ఘ‌ట‌న అని అన్నారు. చ‌నిపోయిన‌, గాయ‌ప‌డిన వారి కుటుంబాల‌కు ప్ర‌ధాని ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.