కేరళ లో సచిన్ గ్రంథాలయం

ప్రపంచ వ్యాప్తంగా సచిన్ టెండూల్కర్‌కి అభిమానులు కోట్లలో ఉంటారు. సచిన్‌పై అభిమానాన్ని వీరు ఒక్కొక్కరూ ఒక్కోలా చాటుకుంటారు. తాజాగా కేరళకి చెందిన వశిష్ట్ మాస్టర్ బ్లాస్టర్‌కు వీరాభిమాని. లెక్చరర్‌గా పనిచేస్తోన్న ఆయన సచిన్‌ పేరు మీద ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు. సచిన్ గ్యాలరీ పేరుతో ఉన్న ఈ లైబ్రరీలో భారత దిగ్గజ క్రికెటర్‌పై ప్రచురితమైన పుస్తకాలు ఉన్నాయి. 10 భాషలకు చెందిన 60కి పైగా సచిన్ బుక్స్ దీనిలో ఉన్నాయి. మాస్టర్‌కు చెందిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఇక్కడికే వస్తున్నారు. సచిన్‌పై తన అభిమానాన్ని చాటుకునేందుకు ఇలాంటి అవకాశం రావడం సంతోషంగా ఉందని వశిష్ట్ చెబుతున్నారు.