కుదుటపడుతున్న ముంబై

ముంబైని అతలాకుతలం చేసిన వానలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వ‌ర్షం లేక‌పోవ‌డంతో జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రయాణీకులతో  రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. అధికారులు సబర్బన్  రైలు సేవలను కూడా పునరుద్ధరించారు. పశ్చిమ, మధ్య, నౌకాశ్రయ మార్గాల్లో పలు రైళ్లు నడువడంతో రాత్రంతా స్టేషన్లలోనే ఉండిపోయిన వందల మంది ఇండ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు వరద మృతుల సంఖ్య 15కు చేరింది. ఠాణేలో ముగ్గురు చనిపోగా.. దహిసర్, సంతానగర్, ఎల్ఫిన్‌  స్టెన్, ఘట్కోపర్, మద్  జెట్టి, విఖ్రొలిలో ఒక్కొక్కరు మృతి చెందారు.  అటు ముంబైకి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరించింది.