కిలో 223 గ్రాముల బంగారం ప‌ట్టివేత‌

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న కిలో 223 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి వస్తున్న శ్యాంబాబు అనే వ్యక్తిని తనిఖీ చేయగా ఈ బంగారం బయట పడింది. దీని విలువ 36లక్షల 86వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.