కాజల్ నిజంగా అదృష్టవంతురాలే!

గత ఏడాది ‘బ్రహ్మోత్సవం’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’‌తో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌ను ఫేస్ చేసిన కాజల్ ఇక టాలీవుడ్ నుంచి చాపచుట్టేయాల్సిందే అనుకున్నారు చాలామంది. కానీ చిరంజీవి సరసన ‘ఖైదీ నంబర్ 150’లో అవకాశం దక్కించుకుని మళ్లీ రేసులోకి వచ్చింది కాజల్. ఈ సినిమా సక్సెస్ తరువాత తెలుగులో అవకాశాలు తగ్గినా కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టి అక్కడ విజయ్, అజిత్ వంటి హీరోల సరసన నటించే ఛాన్స్‌లను సొంతం చేసుకుంది. ఆ వెంటనే తెలుగులో రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’లో తళుక్కుమనే అవకాశం వచ్చింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన ‘ఎంఎల్ఏ’ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ‘రాజుగారి గది 2’లోనూ ఓ పాత్ర పోషించిందని తెలుస్తోంది. మొత్తానికి కాజల్ దూకుడు చూస్తుంటే అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ అమ్మడికి మరికొన్ని అవకాశాలు రావడం గ్యారంటీ అనేలా కనిపిస్తోంది. ఎంతైనా ఈ టాలీవుడ్ చందమామ నిజంగా అదృష్టవంతురాలే.