ఐదు శతాబ్దాల కథ ‘సువర్ణసుందరి’

పూర్ణ, సాక్షిచౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సువర్ణసుందరి. చరిత్ర ఎప్పుడూ భవిష్యత్‌ను వెంటాడుతుంది చిత్ర ఉపశీర్షిక. ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్ లక్ష్మి నిర్మిస్తున్నారు. సూర్య దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “1509వ సంవత్సరం నుంచి 2017 వరకు ఐదు శతాబ్దాలతో ముడిపడి ఉన్న కథ ఇది. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాం. చరిత్ర మాటున వెలుగులోకి రాని ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిలో ఓ సంఘటనకు వెండితెరరూపమే ఈ సినిమా. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యముంటుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అని తెలిపారు. సాయికుమార్, ఇంద్ర, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.