ఎల్లంపల్లి ఆయకట్టు రెండు పంటలకు నీరు

ఎల్లంపల్లి ఆయకట్టు కింద రెండు పంటలకు నీరందిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్, రాయపట్నంలో గోదావరి నది దగ్గర ఎత్తిపోతల పథకాలను హరీశ్ రావు ప్రారంభించారు. 2 లిప్టుల ద్వారా 3 వేల 400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరిస్తామని భరోసా ఇచ్చారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, IDC చైర్మన్ ఈద శంకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.