ఎయిర్ ఇండియా దక్కేదెవరికి?

‘దేశీయ విమాన సంస్థల్లో విదేశీ ఎయిర్‌లైన్స్ 49 శాతం వరకు వాటా కలిగి ఉండవచ్చు. కానీ ఈ నిబంధన ఎయిర్ ఇండియాకు వర్తించదు’ అని తాజాగా విడుదలైన ఎఫ్‌డీఐ పాలసీ నివేదిక పేర్కొంది. ఈ నిబంధనను బట్టి చూస్తే ఎయిర్ ఇండియాను ఫారిన్ ఎయిర్‌లైన్స్‌కు విక్రయించే అవకాశాలు లేనట్లే కన్పిస్తున్నది. అంతేకాదు, విదేశీ విమాన సంస్థ లేదా ఇన్వెస్టర్ భారత్‌లో ఎయిర్‌లైన్స్‌ను నడుపాలంటే, ఆ సంస్థలో మెజారిటీ వాటా, నియంత్రణ దేశీయుల చేతుల్లోనే ఉండాలని పేర్కొంది. దాంతో ఖతార్ ఎయిర్‌లైన్స్ 100 శాతం పెట్టుబడులతో భారత్‌లో విమాన సంస్థను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికకు అడ్డుకట్టపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.