ఎన్టీఆర్‌తో అను జోడీ!

‘మజ్ను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయెల్‌. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ వంటి అగ్ర హీరోలతో జోడీ క‌ట్టే అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌ పక్కన నటించే అవకాశం కొట్టేసినట్లు సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో తారక్‌ నటించనున్నారు.  ఈ చిత్రంలో తారక్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయెల్‌ని ఎంపికచేసుకున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం తారక్‌ ‘జై లవకశ’, ‘బిగ్‌ బాస్‌’ టీవీ షోతో బిజీగా ఉన్నారు. అను.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, పవన్‌తో ఓ చిత్రంలో నటిస్తోంది.