ఎగ్జిబిషన్ గ్రౌండ్ లీజ్ రద్దు చేయలేదు

రాష్ట్ర ప్రభుత్వంతో ఎగ్జిబిషన్ సొసైటీకి ఎలాంటి విభేదాలు లేవన్నారు సొసైటీ సభ్యులు. ఎగ్జిబిషన్‌ సొసైటీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లీజ్ రద్దు చేశారని వస్తున్న వార్తలు అవాస్తవమని పాలక మండలి సభ్యుడు హరినాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని శాశ్వతంగా ఎగ్జిబిషన్ సొసైటీకి బదలాయిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. 99 సంవత్సరాల లీజుకు సంబంధించి ఆర్ అండ్ బి డిపార్టుమెంట్ తో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఎగ్జిబిషన్ సొసైటీకి సీఎం కేసీఆర్ అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని సెక్రటరీ ఆదిత్య మార్గం చెప్పారు. లీజు విషయం అర్ధం కాక కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.