ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

యూత్ లో ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకున్న కథానాయికల జాబితాలో పూజా హెగ్డే ఒకటి. ‘ముకుంద’ .. ‘ఒక లైలా కోసం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో మరిన్ని మార్కులు కొట్టేసింది. అంతేకాదు .. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రంలోను అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోననీ .. కెరియర్ పైనే పూర్తి దృష్టి పెట్టానని పూజా హెగ్డే తేల్చి చెప్పింది. తాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి విదేశాల్లోనే జరుగుతుందని అంది. చాలా ఎక్కువ మందిని పిలిచేసి .. ఆర్భాటంగా పెళ్లి చేసుకునే ఆలోచన తనకి లేదని చెప్పింది. అత్యంత సన్నిహితులైన అతికొద్ది మందిని మాత్రమే పెళ్లికి పిలుస్తానని స్పష్టం చేసింది.