ఆ రెండు పార్టీలు మేకవన్నె పులులు

కాంగ్రెస్, టీడీపీపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. ఆ రెండు పార్టీలు మేకవన్నె పులులేనని మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాభివృద్ధిని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని విమర్శించారాయన. ముదిగొండలో రైతులను కాల్చిచంపిన కాంగ్రెస్ నేతలు… బషీర్‌ బాగ్ అమరులకు నివాళులర్పించిడం దురదుష్టకరమన్నారు కర్నె ప్రభాకర్.