ఆర్టీసీని లాభాల్లో నడుపుతాం

ప్రజా రవాణాలో దేశంలోనే టీఎస్‌ఆర్టీసీ మెరుగ్గా ఉందని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ పనితీరుపై సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావుతో కలిసి మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రిజీయన్ల వారీగా ఆర్టీసీ స్థితిగతులపై మంత్రి ఆరా తీశారు. ఆర్టీసీ సేవలను విస్తరిస్తూనే నష్టాలను తగ్గించి లాభాల్లో నడుపుతామని మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రూ. 2 వేల కోట్ల ఆర్థికసాయం అందించడంతో సంస్థ మెరుగైందన్నారు. కొత్త బస్సుల కొనుగోలుకు నిధుల కోసం సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు.