ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ల గొడవ.. శిశువు మృతి

చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న పేషెంట్ ను ఆపరేషన్ బెడ్ పై వదిలేసి.. గొడవ పడి, ఓ చిన్నారి మృతికి కారణమయ్యారు ఇద్దరు డాక్టర్లు. రాజస్థాన్ జోథ్ పూర్ లోని ఉమైద్ హాస్పటల్ లో ఈ ఘటన జరిగింది. ఓ గర్భిణీకి డెలవరీ చేస్తుండగా.. ఇద్దరు డాక్టర్ మధ్య మొదలైన చిన్న గొడవ, క్రమంగా పెరిగింది. దీంతో ఆపరేషన్ థియేటర్ లోనే డాక్టర్లిద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఆపరేషన్ ను నిర్లక్ష్యం చేశారు. దీంతో పుట్టిన బిడ్డ కొద్ది సేపటికే మృతి చెందింది. డాక్టర్లిద్దరూ గొడవ పడ్డ వీడియో వైరల్ గా మారడంతో.. వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.