ఆధునిక పద్ధతుల్లో అత్యధిక దిగుబడి సాధించాలి

వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తామన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ.. అత్యధిక దిగుబడులు సాధించాలని మంత్రి రైతులకు సూచించారు. గతంలో రైతుల ఆత్మహత్యలకు కరెంట్ కోతలు కూడా కారణమయ్యాయని, సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నిరంతరం కరెంట్ ఇస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఎన్ని సంక్షోభాలు వచ్చినా మన దేశం ఎదుర్కొని నిలబడిందని మంత్రి ఈటెల వివరించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.