అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

మన ఊరు- మన ఎంపి కార్యక్రమంలో భాగంగా ఎంపి కవిత ఆర్మూర్ నియోజవర్గం డొంకేశ్వర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు ఎంపీ కవితకు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, మంగళహారతులతో సాదారంగా ఆహ్వానించారు. అటు గంగపుత్రులు తమ సంప్రదాయ పద్దతిలో వర్తులాకార వల, బెలూన్లతో స్వాగతం పలికారు. దీంతో పాటుగా డప్పుచప్పుళ్ళు, బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. అటు గ్రామంలో పాదయాత్ర చేసిన ఎంపీ  కవిత వారితో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  

తెలంగాణలో మానవీయ పాలన కొనసాగుతున్నదని ఎంపీ కవిత అన్నారు. అందరి బాధలను అర్ధం చేసుకునే సీఎం కేసీఆర్ పాలనలో ఆడబిడ్డలకు అధిక ప్రాధ్యాన్యం లభిస్తున్నదని చెప్పారు. ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు అనేక పథకాలను రూపొందించారన్నారు.సీఎం కేసీఆర్ తమను హైదరాబాద్ లో ఉండవద్దని చెప్తారని.. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఎప్పుడూ హితబోధ చేస్తారని వివరించారు.  సీఎం కేసీఆర్ ఆదేశాలు, మార్గదర్శనం ప్రకారం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

అంతకుముందు డొంకేశ్వర్ గ్రామంలో పాదయాత్ర చేసిన ఎంపీ కవిత పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. డొంకేశ్వర్ లిఫ్టు ఆధునీకరణ పనులు, మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఒహెచ్ ఎస్ఆర్ ట్యాంక్, 4 గొర్రెల షెడ్లకు 45 వేల లీటర్ల సామర్థ్యం గల ఒహెచ్ ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. గౌడ సంఘం భవనం, నందిపేట్ మండల కేంద్రంలో స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పలువురు టీయారెస్ నేతలు పాల్గొన్నారు