అనసూయా.. మజాకా!

సెలబ్రిటీలకుసోషల్‌ మీడియా ద్వారా విమర్శలు, ప్రశంసలు రావడం సహజమే. వీటిని కొందరు పట్టించుకుంటే మరికొందరు తేలికగా తీసిపారేస్తారు. ఇంకొందరు గట్టిగా సమాధానం చెబుతారు. అందుకు ఉదాహరణ యాంకర్‌ అనసూయ. ఓ టీవీ షోలో ఆమె వేసుకున్న డ్రెస్సుపై ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్‌ చేశాడు. అంతే ఆ వ్యక్తికి ‘ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది నా ఇష్టం. నీకు నచ్చకుంటే నువ్వు చూడకు. ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా నీ పనులు నువ్వు చూసుకుంటే బెటర్‌’ అంటూ ఘాటైన సమాధానం ఇచ్చింది. అది చూసిన జనాలు అనసూయనా మజాకా అంటున్నారు.