50 కోట్లతో తాండూర్ మున్సిపాలిటీ అభివృద్ధి

50 కోట్ల రూపాయల నిధులతో తాండూరు మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. రోడ్లు, పార్కులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మూడోవిడత హరితహారంలో భాగంగా స్థానిక చెరువు కట్టపై మొక్కలు నాటారు.