పార్లమెంట్ హాలులో విపక్షాల భేటీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో విపక్షాలు సమావేశమయ్యాయి. పార్లమెంట్ భవనంలో పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు భేటీ అయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూతో పాటూ ఇతర విపక్ష నాయకులపై కేసులు, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నేతలు నిర్ణయించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధి నామినేషన్ పై కూడా విపక్ష నేతలు చర్చించారు.