3-4 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 8 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. రాబోయే 24 గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాని ప్రభావంతో 3-4 రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి, అతి భారీ వానలు పడతాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఇప్పటిదాకా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.