24 గంటలు కరెంట్ ఇస్తున్నందుకు రైతుల హర్షం

ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బొమ్మారెడ్డి గూడెంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంటు సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డామన్న అన్నదాతలు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యుత్‌ సమస్యలు పూర్తిగా తొలిగిపోయాయన్నారు. ఇప్పుడు ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంటును సరఫరా చేస్తుంటం గొప్పవిషయమన్నారు.