19 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న ఎంసెట్-2017 రెండో విడుత వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 19, 20 తేదీలలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. దీని ప్రకారం ఈ నెల 19న సర్టిఫికెట్ల పరిశీలన, 22న సీట్ అలాట్‌మెంట్ పూర్తి చేస్తామన్నారు. ఇంజినీరింగ్ ఫస్టియర్ తరగతులను ఈ నెల 24 నుంచి ప్రారంభించనున్నట్టు సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.