సినీ పరిశ్రమలో 12 మందికి నోటీసులు

టాలీవుడ్‌లో డ్రగ్స్‌కు అలావాటుపడ్డ 12 మంది నటీనటులు, సాంకేతిక నిపుణులకు నోటీసులు పంపినట్టు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. నోటీసులు తీసుకున్నవాళ్లు ఎక్నాలెడ్జ్‌మెంట్లు కూడా ఇచ్చినట్లు చెప్పారు. మరికొంత మందికి త్వరలోనే నోటీసులు ఇస్తామన్నారు. నోటీసులు అందినవారంత ఈ నెల 19 నుంచి 27 వరకు నిర్ణీత సమయంలో సిట్‌ ముందు విచారణకు  హాజరుకావాలని స్పష్టం చేశారు. విచారణకు హాజరు కాకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేసినట్లు అకున్ సబర్వాల్ చెప్పారు.  డ్రగ్స్ రాకెట్ కేసులో సిట్ గాని, ఎన్ ఫోర్స్ మెంట్ గాని ఎవరి పేర్లు బయటపెట్టదని స్పష్టం చేశారు.