12న మూడో విడత హరితహారానికి శ్రీకారం

మూడో విడత హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర అటవి శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రదేశాలను కాలినడకన తిరిగి పరిశీలించారు. ఈనెల 12న సీఎం కేసిఆర్ కరీంనగర్‌లో లాంఛనంగా హరితహరాన్ని ప్రారంభించనుండగా.. రేపు మరోసారి రాష్ట్ర స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నామన్నారు. ఆదిలాబాద్ లో ఇందిరా ప్రియదర్శని స్టేడియంతోపాటు ,డిగ్రీ కళాశాలలో పర్యటించారు. రెండు విడతల్లో జరిగిన లోటు పాట్లను జరకుండా చూసుకుంటూ మూడవ విడత హరితహారం ను ముందుకు తీసుకెళ్తామన్న  మంత్రి.. ఇందులో ప్రజల భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.