హైదరాబాద్ లో హై లైఫ్ ఎక్స్ పో

హైద‌రాబాద్ ఇంట‌ర్నేష‌నల్ కన్వెన్ష‌న్ సెంట‌ర్‌లో హై లైఫ్ ఎక్స్ పో ను ప్రముఖ మోడల్ పూజ జవేరి ప్రారంభించింది. మూడు రోజుల పాటు జరగనున్న ఎక్స్‌ పో లో మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన డిజైనర్లు స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది డిజైన‌ర్లు త‌మ ఉత్పత్తులను డిస్ ప్లే క‌మ్ సేల్స్‌కి ఉంచారు. డిజైన‌ర్ చీర‌లు, లేటెస్ట్ జువెలరీ, ఫుట్‌వేర్, హోమ్ డెకార్స్‌, డ్రెస్‌ మెటీరియ‌ల్స్ వంటి ఫ్యాష‌న‌బుల్ థింగ్స్‌ తో పాటు ఇంటీరియర్లు అందుబాటులో ఉంచారు.