హైదరాబాద్ లో మీరాకుమార్ ప్రచారం

ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ హైదరాబాద్ లో పర్యటించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతి ఎన్నికలలో నిలబడ్డానని మీరాకుమార్ చెప్పారు. తనకు మద్దతు ప్రకటించిన 17 రాజకీయ పార్టీలకు మీరాకుమార్‌ కృతజ్ఞతలు తెల్పారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పలు పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరారు.