హరితహారంలో వనజీవి

ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పద్మశ్రీ వనజీవి రామయ్య ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఆస్పత్రి సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని బాధ్యతగా పెంచాలని రామయ్య కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల పెట్టిన హరితహారం కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు.