హరితహారంలో ప్రతిఒక్కరు పాల్గొనాలి

హరితహారంలోప్రతీఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మంత్రి ఈటెల రాజేందర్‌. కరీంనగర్‌ లో ఈ నెల 12న మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం  కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఅర్ టూర్ తో పాటు మూడో విడత హరితహారంపై కరీంనగర్‌ పట్టణంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బీఈడీ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఆ తర్వాత అల్ఫోర్స్ విద్యాసంస్థలో నిర్వహించిన స్పందన్-2017 కార్యక్రమానికి మంత్రి ఈటెల రాజేందర్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మేయర్ రవీందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు.