హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలి

హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి జోగు రామన్న కోరారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని సూచించారు. అందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. హరితహారంపై ఆదిలాబాద్ లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ నగేశ్, పలువురు నేతలు, ఉన్నతాధికారులు ఈ రివ్యూలో పాల్గొన్నారు.