హరితహారంపై మంత్రి హరీష్ స‌మీక్ష

మూడో విడత హరితహారం ఏర్పాట్లపై సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.  హరితహారంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే మోడల్ గా నిలవాల‌ని అధికారులకు సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయేలా ఇలాంటి కార్యక్రమాలు పట్టుదలతో విజయవంతం చేయాల‌న్నారు. అటు హరితహారం కార్యక్రమానికి కలెక్టర్ అద్భుతంగా ప్రణాళికలు సిద్ధం చేశార‌ని కొనియాడారు. వర్షాలు పడకముందే జిల్లా వ్యాప్తంగా 4లక్షల పైగా గుంతలు ఏర్పాటు చేశారని చెప్పారు. లక్షా 15వేల ట్రీ గార్డ్స్ ఇప్పటికే గ్రామాల‌కు చేరుకున్నాయన్నారు. ప్రతి ఊరికి 12వేల చెట్ల నాటేందుకు రెడీగా ఉన్నాయన్నారు. ప్రతి రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని హరీష్ రావు సూచించారు.