హన్మకొండలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరితహారం

మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు కుడా చైర్మన్‌ మర్రియాదవరెడ్డి. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్స్‌ లో వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి కూడా ఛైర్మన్‌, టీఆర్ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవీందర్ రావు హజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పండ్ల మొక్కలతో పాటు వేప, తులసి మొక్కలను పంపిణీ చేశారు.