స్వాతి స‌త్తా చాటేనా?

ర‌క్షిత్, స్వాతి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరెకెక్కిన‌ లండ‌న్ బాబులు చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాల‌ను వేగవంతం చేసి జూలై నెలాఖ‌రులో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్. ఈ చిత్రాన్ని బి. చిన్ని కృష్ణ తెర‌కెక్కించ‌గా , మారుతి టాకీస్ బేన‌ర్ పై మారుతి ఈ మూవీని నిర్మిస్తున్నారు. త‌మిళ మూవీ ఆండ‌వ‌న్ క‌ట్టాలాయ్ మూవీకి రీమేక్ గా లండన్ బాబులు చిత్రం రూపొందుతుంది. ఇటీవల చిత్ర టీజ‌ర్ తో పాటు ట్రైల‌ర్ ని విడుద‌ల చేసి మూవీపై మరింత ఆస‌క్తిని పెంచారు. త్రిపుర సినిమా త‌ర్వాత‌ క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ తెలుగు సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాతో మ‌రోసారి టాలీవుడ్ లో త‌న స‌త్తా చూపాల‌ని భావిస్తుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేస్తున్న ఈ చిత్రానికి కె మ్యూజిక్ అందిస్తున్నాడు.