స్మృతికి సమాచార శాఖ అదనపు బాధ్యతలు

కేంద్ర సమాచార శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు మంత్రి స్మృతి ఇరానీ. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసేందుకు వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఆయన నిర్వర్తిస్తున్న సమాచార శాఖ బాధ్యతలు స్మృతికి అప్పగించారు. దీంతో, ఆమె ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు, వెంకయ్య ఇన్నాళ్లు నిర్వర్తించిన పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ కు అప్పగించారు ప్రధాని మోడీ.