స్టైలిష్ స్టార్ సరసన అనుఇమాన్యుయేల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా మూవీ రూపొంద‌నుంది.. ఈ మూవీకి నా ఇల్లు ఇండియా ట్యాగ్ లైన్.. ఈ మూవీని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ప్రముఖ కథా రచయిత వక్కతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వ‌తున్నాడు. శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మాత‌.. తాజాగా ఈ మూవీ హీరోయిన్ అను ఇమాన్యుయేల్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. ఈ మూవీ రెగ్యూల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ ఫ‌స్ట్ వీక్ నుంచి ప్రారంభంకానుంది.