సెయిలింగ్ కు హుస్సేన్ సాగర్ అనుకూలం

సెయిలింగ్‌ స్పోర్ట్స్‌ కు హుస్సేన్ సాగర్ లేక్‌ ఎంతో అనుకూలించే మంచి ఆహ్లాదకర వాతావరణమన్నారు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌. స్కిల్స్‌, శ్రమతో కూడుకున్న క్రీడ సెయిలింగ్‌ అని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ లో 32వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలను గవర్నర్‌ నరసింహన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ దినకర్ బాబు, ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ కోమొడోర్ లెఫ్టినెంట్ జనరల్ కేకే అగర్వాల్, క్రీడాకారులు హాజరయ్యారు.

ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, లేసర్ క్లాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సెయిలింగ్ పోటీలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సహకారం అందిస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్‌ కు రికార్డు స్థాయిలో ఎంట్రీలు వచ్చాయని ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ కోమొడోర్ లెఫ్టినెంట్ జనరల్ కేకే అగర్వాల్ తెలిపారు.