సీనియర్ మంత్రులతో రాజ్ నాథ్ సమీక్ష

జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతలు, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తలపై చర్చించేందుకు సీనియర్ కేంద్ర మంత్రులు ఢిల్లీలో సమావేశమయ్యారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్ లో వరుస కాల్పులు, సిక్కిం సరిహద్దులో చైనా దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రులు శాంతిభద్రతలపై సమీక్ష జరిపారు.