సీఎం కాళ్లు కడిగిన మహిళలు

జార్ఖండ్ సీఎం రఘువర్ కొత్త  చిక్కుల్లో పడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు మహిళలు కాళ్లు కడిగారు. ఇప్పుడది వివాదంగా మారింది. గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. మహిళలతో కాళ్లు కడిగించుకుంటారా అని మండిపడుతున్నాయి ఆ రాష్ట్ర ప్రతిపక్షాలు. ఆదివారం గురుపౌర్ణమి సందర్భంగా జంషెడ్ పూర్ లో జరిగిన గిరిజన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం గురువర్ దాస్. ఈ కార్యక్రమంలో ఆయన పాదాలకు ఇద్దరు మహిళలు పాదాభిషేకం చేశారు. దీన్ని తప్పుపడుతున్నాయి మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు. మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ సీఎంపై ఆరోపణల వర్షం కురిపించాయి. అయితే… ఇది గిరజన సంప్రదాయంలో భాగమని… పెద్దలకు పాదాభిషేకం చేయడంలో తప్పు లేదని అధికారపార్టీ వర్గాలు. సీఎం కావాలనే ఇలా చేయించుకున్నారనే వాదనల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మహిళలను కించపరిచే సంస్కృతి తమది కాదని తెలిపారు.