సింగరేణిలో 60 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీ‌రాంపూర్ ఏరియాలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఎమ్మెల్యే దివాక‌ర్ రావు, జిల్లా కలెక్టర్ కర్ణన్ తో క‌లిసి సింగ‌రేణి డైరెక్ట‌ర్ భాస్కర్ రావు మొక్క‌లను నాటారు. అట‌వీశాఖ న‌ర్స‌రీల‌కు ధీటుగా సింగ‌రేణి సొంతంగా మొక్క‌ల్ని పెంచి వాటిని వివిధ ప్రాంతాల్లో నాటుతోంద‌ని భాస్క‌ర్ రావు చెప్పారు. సింగరేణి నర్సరీల్లో కోటి మొక్కలను పెంచుతున్నామని, ఈ ఏడాది హరితహారంలో 60 లక్షల మొక్కలు నాటుతామని ప్రకటించారు. సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో నాటిన మొక్క‌ల్ని సంర‌క్షించేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. కార్మిక కుటుంబాలు కూడా మొక్క‌ల్ని నాటి సంర‌క్షించాల‌ని సూచించారు.