సాక్షి, వినేశ్‌కు ప్రపంచ రెజ్లింగ్ బెర్త్‌లు

పారిస్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌నకు భారత మహిళా స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ పోగట్ అర్హత సాధించారు. తాజాగా వేర్వేరు విభాగాల్లో నిర్వహించిన ట్రయల్స్ అనంతరం భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్‌ఐ) ఎనిమిది మందితో జాబితాను విడుదల చేసింది. ఇందులో రియో ఒలింపిక్ కాంస్య విజేత సాక్షి(60కి), వినేశ్(48కి) తమ విభాగాలను మార్చుకుని అర్హత సాధించారు. వీరితో పాటు శీతల్(53కి), లలిత(55కి), పూజ ధండా(58కి), శిల్పి(63కి), నవ్‌జ్యోత్‌కౌర్(69కి), పూజ(75కి) ఉన్నారు. పోగట్ సిస్టర్స్‌గా పేరొందిన గీత, బబిత కనీసం ట్రయల్స్‌కు హాజరు కాకపోగా, రీతు, సంగీత అర్హత సాధించడంలో విఫలమయ్యారు.