శ్రీలంకలో సోనమ్ ఎంజాయ్!

గతేడాది నీర్జా మూవీతో సూపర్‌హిట్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌కపూర్. తరచూ సినిమాలతో బిజీగా ఉండే సోనమ్ తాజాగా శ్రీలంక వెకేషన్ టూర్‌కి వెళ్లి చక్కర్లు కొడుతున్నది. సోనమ్ తన సోదరి రియా కపూర్‌తో కలిసి ఇటీవలే శ్రీలంకకు వెళ్లింది. ఈ ఇద్దరూ సిస్టర్స్ శ్రీలంకలోని అందమైన లొకేషన్లకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అత్యంత అందమైన ప్రదేశాలు, కట్టడాలను సందర్శించి ఫొటోలకు ఫోజిచ్చారు. సోనమ్ కపూర్ డిఫరెంట్ కాస్ట్సూమ్స్ ధరించి తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోనమ్‌కపూర్ ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌తో కలిసి పద్మన్ మూవీలో నటిస్తుంది. దీని తర్వాత రియా కపూర్ తీయనున్న వీరే ది వెడ్డింగ్ మూవీకి సోనమ్‌ టైం కేటాయించనుంది.