శశికళపై నివేదిక ఇచ్చిన రూప బదిలీ

కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళకు రాజభోగాలు కల్పిస్తున్నారని నివేదిక ఇచ్చిన ఆ రాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీపై బదిలీ వేటు పడింది. ఆమెను ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేసింది ప్రభుత్వం. శశికళ కోసం జైలులో ప్రత్యేకంగా వంటగది ఏర్పాటు చేశారని, ఇందుకోసం జైళ్ల శాఖ డీజీ లంచం తీసుకున్నారని రూప నివేదిక ఇచ్చారు. దీన్ని డీజీ ఖండించడంతో.. తన నివేదిక తప్పు అనిపిస్తే ఉన్నతస్థాయి విచారణ జరిపించుకోవచ్చని రూప చెప్పారు. దీనిపై సిద్ధరామయ్య సర్కారు ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. అయితే, కమిటీ ఏర్పాటు కాకముందే.. రూపను బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.  ఐతే, సాధారణ బదిలీల్లో భాగంగానే రూపను ట్రాన్స్ ఫర్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.