వెంకయ్యకు టిఆర్ఎస్ ఎంపీల శుభాకాంక్షలు

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఎన్డీఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల  నిజామాబాద్‌ ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి ఢిల్లీలో వెంకయ్య ఇంటికి వెళ్లిన కవిత.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ పార్లమెంటేరియన్, తెలుగువాడైన వెంకయ్యనాయుడుకు తమ పార్టీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని కవిత చెప్పారు.

వెంకయ్యనాయుడుని కలిసి అభినందించిన ఎంపీలలో కవితతో పాటు జితేందర్ రెడ్డి, కే కేశవరావు, వినోద్‌, విశ్వేశ్వర్ రెడ్డి, సీతారాం నాయక్, ప్రభుత్వ సలహాదారు వివేక్ తదితరులు ఉన్నారు.